ట్రాక్టర్ బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు
MDK: చేగుంట మండల కేంద్రంలోని జీవీక పరిశ్రమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన చాకలి భూమేష్ చేగుంట నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన భూమేష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు.