VIDEO: అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు
KDP: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మైదుకూరు రోడ్డులోని ఎస్బీఐ బ్యాంకు వద్ద, గతంలో వర్షం కురిస్తే నేషనల్ హైవే 67 రహదారిపైకి నీరు చేరేది. అయితే ఈసారి మున్సిపల్ అధికారులు ఇవాళ యంత్రాల సహాయంతో నీటిని కల్వర్టుల ద్వారా పంపించేలా చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా రోడ్డుపైకి నీరు చేరలేదు.