ఘనంగా పెద్ద పోచమ్మ అమ్మవారి ఊరేగింపు
NZB: బోధన్ పట్టణంలో పెద్ద పోచమ్మ అమ్మవారి ఊరేగింపు శుక్రవారం ప్రారంభమైంది. పట్టణంలోని 16వ వార్డులో పునఃనిర్మాణం చేసిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా అమ్మవారిని ఊరేగించారు. పట్టణంలోని మహాలక్ష్మీ మందిరం నుంచి పెద్ద పోచమ్మ అమ్మవారిని పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో అమ్మవారికి స్వాగతం పలికారు.