VIDEO: 100 వసంతాల హాకీ ర్యాలీ
అనకాపల్లి: ఎలమంచిలి పట్టణంలో 100 వసంతాల హాకీ పండగ ర్యాలీని గురువారం నిర్వహించారు. జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కొఠారు నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు ప్రారంభించారు. భారతదేశంలో హాకీ ఆటకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు నరేష్ తెలిపారు. ఈనెల 7న స్థానిక గ్రౌండ్‌లో జిల్లా స్థాయి హాకీ పోటీలు జరుగుతాయన్నారు.