విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కోనసీమ: రామచంద్రపురం మండలం పెదతాళ్లపొలం వద్ద కృష్ణా జిల్లాకి చెందిన యువకులు విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా మంగళవారం ప్రమాదవశాత్తు షాక్‌కు గురై ఓ వ్యక్తి చనిపోగా ఇద్దరికీ గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలిసిన కూటమినేత సత్యం వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.