VIDEO: ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుపై రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం
VSP: స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మెడికల్ ఇన్సూరెన్స్‌ను పాత విధానంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రీమియాన్ని రూ.1300 నుంచి రూ.8500కు, అంటే 700% పెంచడం అన్యాయమని పోరాట కమిటీ నాయకుడు జే అయోధ్యరాం అన్నారు. పెన్షన్ రూ.3 వేలే వస్తుండగా ఈ భారాన్ని భరించలేమన్నారు.