అత్తోటలో రైతు సంఘం నాయకుల పర్యటన

అత్తోటలో రైతు సంఘం నాయకుల పర్యటన

GNTR: కొల్లిపర మండలంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి పర్యటించారు. అధిక వర్షాల వల్ల వెయ్యి ఎకరాల్లో రెండు సార్లు, 100 ఎకరాల్లో మూడవసారి వెద పెట్టాల్సి వచ్చిందని సర్పంచ్ నాగ పున్నేశ్వరరావు తెలిపారు. తరచూ పంట నష్టపోతున్నా ప్రభుత్వ సాయం అరకొరగానే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కూడా అందుబాటులో లేవని ఆయన పేర్కొన్నారు.