మాజీ ఎంపీ సురవరం అంతిమయాత్ర షెడ్యూల్!

మాజీ ఎంపీ సురవరం అంతిమయాత్ర షెడ్యూల్!

TG: CPI మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఉదయం 9 గంటలకు మఖ్దూం భవన్‌కు తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. అక్కడి నుంచి గాంధీ మెడికల్‌ కాలేజీ వరకు అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధన కోసం అప్పగిస్తారు.