బేతంచెర్లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

KRNL: సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని సీఐ డి. వెంకటేశ్వరరావు, ఎస్సై రమేష్ బాబు అన్నారు. ఇవాళ బేతంచెర్ల పట్టణంలో పోలీస్ స్టేషన్‌లో గతంలో వివిధ కేసులలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలతోపాటు గ్రామ బహిష్కరణ తప్పదని హెచ్చరించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని తెలిపారు.