ఆవాస్ యోజన దరఖాస్తులకు గడువు పెంపు
PLD: రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆవాస్ గృహ యోజన దరఖాస్తుల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ఈనెల 14వ తేదీ వరకు అవకాశం కల్పించినట్టు మాచర్ల హౌసింగ్ ఏఈ సాతులూరి మరియదాసు తెలిపారు. మండల పరిధిలో అర్హులైన వారు తప్పనిసరిగా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు సర్వేలో త్వరగా పేరునమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.