పత్తి పంట సాగుపై 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

పత్తి పంట సాగుపై 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

ప్రకాశం: జిల్లా కొమరోలు మండలంలోని దద్దవాడ, బాధినేనిపల్లి గ్రామాలలో శుక్రవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాగా, ఆత్మ పథకం కింద రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేశారు.