ఏపీలో ప్రతి ఇంటికీ కుళాయి: కేంద్రమంత్రి

ఏపీలో ప్రతి ఇంటికీ కుళాయి: కేంద్రమంత్రి

AP: జల్‌జీవన్ మిషన్ 2.0కు అనుమతులిచ్చినట్లు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. జేజేఎం 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా ఏపీలో ప్రతి ఇంటికి కుళాయి లక్ష్యం నెరవేరుతుందని సీఆర్ పాటిల్ తెలిపారు. నీటి నాణ్యత పరీక్షకు డ్వాక్రా మహిళల సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. మిషన్ సాకారానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.