మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి

MBNR: మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలని మూఢనమ్మకాల నుంచి బయటకు రావాలన్నారు. మహిళల ఆలోచనలోను మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.