'రైతాంగం సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి'
ప్రకాశం: చంద్రశేఖరపురంలోని స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో గురువారం రైతు సంఘం నాయకుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఊస వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న పంటల వ్యయభారం, మార్కెట్‌లో తగిన ధరలు లేకపోవడం, సాగునీటి సమస్యలు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.