VIDEO: 'మున్సిపాలిటీ వద్దు… గ్రామపంచాయతీ కావాలి'
MHBD: డోర్నకల్ పట్టణంలో గాంధీ కూడాలిలో మహిళలు ప్రధాని రహదారిపై మంగళవారం ఆందోళన చేపట్టారు. డోర్నకల్‌ను మున్సిపాలిటీగా కాకుండా గ్రామపంచాయతీగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.