'పుర' ఎన్నికల్లో రెబల్స్ ఘన విజయం
ఆదిలాబాద్: మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు రెబల్ అభ్యర్థులు షాక్ ఇచ్చారు. పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ, స్వతంత్రులుగా బరిలో నిలిచి తమ సత్తా చాటారు. 43వ వార్డు నుంచి శ్రీనివాస్, 45వ వార్డు నుంచి బండారి సంతోశ్ కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోయినా స్వతంత్రులుగా పోటీ చేసి భారీ విజయం అందుకున్నారు.39వ వార్డులో మిట్టపుర్ యోగేష్‌కు ఓటర్లు మద్దతిచ్చారు.