ప్రపంచ కప్ విజేత శ్రీ చరణికి సన్మానం

ప్రపంచ కప్ విజేత శ్రీ చరణికి సన్మానం

KDP: మహిళల 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన కడప క్రీడాకారిణి నల్లపురెడ్డి శ్రీ చరణిని బుధవారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సన్మానించింది. ఇందులో భాగంగా జోనల్ మేనేజర్ ఎ. వైద్యనాథ్ ఆమె నివాసంలో కలిసి, చారిత్రక విజయంలో స్పిన్నర్‌గా ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఆమె అంకితభావం ఆంధ్రప్రదేశ్‌కు కీర్తి తెచ్చిందని కొనియాడుతూ.. జ్ఞాపికను బహూకరించారు.