పవన్‌కు అమర జవాన్ కుటుంబం కన్నీటి విజ్ఞప్తి
AP: దేశం కోసం ప్రాణాలర్పించిన అగ్నివీర్ మురళీ నాయక్ మొదటి వర్ధంతి కార్యక్రమానికి రావాలని ఆయన తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. ఏప్రిల్ 14న జరిగే ఈ వేడుకకు పవన్ వస్తే తమ కుమారుడి ఆత్మ శాంతిస్తుందని కన్నీటితో వీడియో సందేశం పంపారు. గతంలో పవన్ ఈ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.