ఎన్నికల 'పంచాయితీ'.. తల్లి ఆత్మహత్య
NLG: చిట్యాల (M) ఏపూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన కూతురు అశ్వినిపై పోటీ చేయాల్సి రావడంతో మనస్తాపానికి గురైన లక్ష్మమ్మ ఆత్మహత్య చేసుకుంది. BRS మద్దతుతో లక్ష్మమ్మ, కాంగ్రెస్ మద్దతుతో అశ్విని 3వ వార్డు నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. తల్లిపై పోటీ చేయలేనని అశ్విని నామినేషన్ ఉపసంహరించుకోవడంతో కుటుంబంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో లక్ష్మమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.