కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

BPT: బాపట్ల పట్టణ శివారులోని పొన్నూరు వెళ్లే రహదారి ఎర్రకాలువలో స్థానికులు శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం కాలువలో కొట్టుకు వచ్చి తూముల వద్ద ఆగిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు బాపట్ల పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.