162 పరుగులే అయినా.. ఢిల్లీకి కష్టమే?

162 పరుగులే అయినా.. ఢిల్లీకి కష్టమే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావించగా, అది అనూహ్యంగా బౌలర్లకు సహకరిస్తోంది. స్పిన్నర్లతో పాటు ఫాస్ట్ బౌలర్లు కూడా బౌలింగ్‌లో మంచి ప్రభావం చూపగలిగారు. దీంతో MI 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, ఈ పిచ్‌పై ఇది పోరాడగలిగే స్కోరుగానే కనిపిస్తోంది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మాత్రం DCకి ఈ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే.