VIDEO: అగ్నిమాపక భద్రతపై ప్రత్యేక కార్యక్రమం
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలో బుధవారం ఫైర్ శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఫైర్ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.