కంకిపాడులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

కంకిపాడులో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

కృష్ణా: కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిని ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.