కొయ్యూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కొయ్యూరు మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ASR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు గురువారం సూచించారు. పొంగుతున్న వాగులు దాటవద్దన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, టీఏ సుబ్బారావు, సీవో ప్రకాష్, టైపిస్ట్ నందన్ నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. వర్షాల వల్ల ఏవైనా ప్రమాదాలు జరిగితే 8688910479, 9490835404 నెంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.