VIDEO: 'మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి'
ములుగు: జిల్లా ఫిషరీస్ అధికారి సల్మాన్ రాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇవాళ ములుగు మండలానికి చెందిన మత్స్యకారులకు 8.10 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి విడత పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. చేప పిల్లలను గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పెంచి మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు.