VIDEO: రోడ్డుపై నిలిచిన నీటిలో వరి నాట్లు నాటి నిరసన

NDL: నందికొట్కూరు మండలంలోని కొణిదల గ్రామంలో బస్టాండు నుండి ఇళ్లకు వెళ్లే దారిలో రోడ్డుపై నీరు నిలిచి ఇబ్బంది కలిగించడంతో గురువారం సీపీఎం నాయకులు పకీర్ సాహెబ్ ఆధ్వర్యంలో బురద నీటిలో వరి నాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డును రిపేరు చేయాలని చాలాసార్లు గ్రామపంచాయతీకి అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు.