'రంగనాయకుల గుడిని కాపాడండి'

NLR: ఉదయగిరిలోని రాయల నాటి చరిత్ర కలిగిన రంగనాయకుల గుడిని అసాంఘిక కార్యకలాపాల నుంచి కాపాడాలని పట్టణ ఆలయాల ఉత్సవాల కమిటీ సభ్యులు పురావస్తు శాఖ అధికారులను కోరారు. వారు మాట్లాడుతూ.. ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ నుంచి దేవాదాయ శాఖకు మారుస్తే దేవుని కైంకర్యాలు చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు.