'న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి'
తూ. గో జిల్లా కోర్టు, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఇటీవల న్యాయవాదులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు, నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలన్నారు.