భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల పంపిణీ
KMR: లింగంపేట్ మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగాల కార్మిక జిల్లా సంఘం ఆధ్వర్యంలో, కార్మికులకు లేబర్ కార్డులను ఇవాళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రతి కార్మికునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అర్హులైన కార్మికులు లేబర్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.