జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం

జిన్నింగ్ మిల్లులో అగ్ని ప్రమాదం

ASF: ఆసిఫాబాద్ మండలం బూరుగుడా గ్రామ పరిధిలో RS జిన్నింగ్ మిల్లులో శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పత్తి వాహనం అన్‌లోడ్ చేస్తుండగా వాహనం సైలెన్సర్ నుంచి నిప్పు రవ్వలు పడడంతో పక్కనే ఉన్న పత్తికుప్ప అంటుకుంది. గమనించిన కార్మికులు నీటిని చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 60 KGల పత్తి దగ్ధం అయిందని పేర్కొన్నారు.