మంత్రి వివేక్‌తో కలిసి విస్తృత ప్రచారం
KNR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారం చివరి రోజైన ఇవాళ షేక్ పేటలో గల 61, 62వ బూత్‌లలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం. సునీతా రావులతో కలిసి ఆయన గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు.