ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి రావాల్సిందే: స్పీకర్

AP: ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి రావాల్సిందేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఏడాదికి పైగా కొందరు సభకు రావడం లేదని.. శాసనసభ్యులుగా గెలిచి అసెంబ్లీకి రాకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బయట చెప్పే సమస్యలను అసెంబ్లీకి వచ్చి చర్చించాలని హితవు పలికారు. సభ్యులు లెవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతారని తెలిపారు. రైతులను తప్పుదోవ పట్టించవద్దని పిలుపునిచ్చారు.