'గడువు ముగుస్తుంది.. వేగం పెంచండి'
విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి రెవెన్యూ సిబ్బందికి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమీక్షలో తక్కువ వసూళ్లు చేసిన అడ్మిన్ కార్యదర్శులను మందలించారు. పనిలో మార్పు లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువు ముగుస్తుండటంతో వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.