అభివృద్ధి పనులు ప్రారంభించిన బాలకృష్ణ

SS: చిలమత్తూరు మండలం టేకులోడు ఎంజేపీ పాఠశాలలో రూ.8.60 కోట్లతో నిర్మించిన నూతన ప్రయోగశాల, వసతిగృహ సముదాయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.