VIDEO: 'జాబ్ మేళా కు విశేష స్పందన'
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి డా.ప్రియాంక తెలిపారు. ఈ మేళాకు 56 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.