'రామగుండం ప్లాంట్‌ను NTPC అధ్వర్యంలో చేపట్టాలి'
PDPL: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది.