ఉమా మార్కండేయ స్వామి సన్నిధిలో ఎంపీ
E.G: రాజమండ్రిలోని శ్రీ ఉమా మార్కండేయ స్వామి వారి ఆలయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇవాళ సందర్శించారు. ఆమె జన్మదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు హారిక నర్సిపల్లి, తదితరులు పాల్గొన్నారు.