'లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

'లోక్ అదాలత్‌ను  విజయవంతం చేయాలి'

WNP: ఈనెల 15న జిల్లా న్యాయస్థానాల్లో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి. రజని కోరారు. పోలీస్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేసుల పెండింగ్ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు. లోక్ అదాలత్ విజయానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు.