విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
ADB: ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న ముత్తునూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఎగ్జామ్ ప్యాడ్‌లు, పెన్నులు, స్కేళ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.