నత్తనడకన రహదారి పనులు.. ప్రజల విజ్ఞప్తి

నత్తనడకన రహదారి పనులు.. ప్రజల విజ్ఞప్తి

SKLM: సరుబుజ్జిలి మండల కేంద్రంలో చేపడుతున్న రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రహదారిపై రాళ్లు తేలిపోవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు తరచూ జారి పడే పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పనులను వేగవంతం చేయాలని ప్రజలు, స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు.