డ్రగ్స్ అమ్ముతున్న ముఠా అరెస్ట్

డ్రగ్స్ అమ్ముతున్న ముఠా అరెస్ట్

HYD: నాగోల్‌లో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ, నాగోల్ పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 25.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను అడ్డుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.