విజనరీ ఇన్‌సైట్స్‌కు జాతీయ అవార్డు
VSP: విశాఖలోని శంకర్ ఫౌండేషన్ నేత్ర ఆసుపత్రి నెలవారీగా ప్రచురిస్తున్న ‘విజనరీ ఇన్‌సైట్స్’ వార్తాలేఖకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు లభించింది. డెహ్రాడూన్‌లో జరిగిన 47వ అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సులో ఈ వార్తాలేఖకు రెండో బహుమతి అందుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ విజయాన్ని అభినందించారు.