కోదాడలో ఉచిత దంత వైద్య శిబిరం
SRPT: కోదాడ పట్టణంలోని కిట్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో పట్టణానికి చెందిన కళ్యాణి మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నోరు మరియు దంత వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణి విద్యార్థులకు దంత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం దంత పరీక్షలు నిర్వహించారు.