శ్రీశైల జలాశయం నుంచి నీటి విడుదల

NDL: శ్రీశైల జలాశయం నుంచి గురువారం ఉదయం 6 గంటల సమయానికి 1,155 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో తెలంగాణ పరిధిలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు ఆవిరి రూపంలో 355 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రాజెక్టులో 38.01 టీఎంసీల నీటి సామర్థ్యంతో 815.19 నీటిమట్టం నమోదయింది.