హెల్త్ కార్డులను పంపిణీ చేసిన కలెక్టర్
BPT: NTR హెల్త్ కార్డుల ద్వారా అనాధ పిల్లలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే శిశు గృహంలో అనాధ శిశువులకు NTR హెల్త్ కార్డులను మంగళవారం కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ PD రాధా మాధవి, తదితరులు పాల్గొన్నారు.