ట్రైన్‌పై రాళ్లు విసిరి.. పోలీసుల చేతికి చిక్కి..!
MDCL: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఆపరేషన్ సమ్రక్ష ప్రోగ్రాం చేపట్టింది. చర్లపల్లి–ఘట్‌కేసర్ మధ్య ట్రైన్ నెం.12746 పై రాళ్లు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. రైల్వే చట్టం సెక్షన్ 153, 147 కింద కేసు నమోదు చేశారు. ప్రయాణికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. రైల్వే ఆస్తుల రక్షణతో పాటు ప్రయాణికుల సురక్ష కోసం ఇలాంటి చర్యలు కొనసాగుతాయన్నారు.