దేవుడిని నేను అదే కోరుకుంటా: బ్రహ్మానందం

దేవుడిని నేను అదే కోరుకుంటా: బ్రహ్మానందం

బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారం బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మనిషికి ఎంత ధనం ఉన్నా.. ఆనందం లేని జీవితం వ్యర్థం. అందరికి ఆనందం పంచే సత్తా, శక్తి కలిగిన ముఖాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఇంతకన్నా నాకేం కావాలి. ఆ దేవుడు ఎన్ని జన్మలు ఇచ్చినా అన్నింటిలోనూ ఇతరులకు ఆనందం పంచే జన్మ ఇవ్వాలని కోరుకుంటా' అని చెప్పారు.