'ఎన్నికల్లో పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు'

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసులు టీడీపీ తరఫున పక్షపాతంగా వ్యవహరించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర అభ్యర్థి సురేష్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులపై దాడులు జరిగినా, కేసులు తమ పార్టీ కార్యకర్తలపై మాత్రమే పెట్టారని విమర్శించారు.