రహదారిపై వరద..రాకపోకలకు ఇబ్బందులు

రహదారిపై వరద..రాకపోకలకు ఇబ్బందులు

ASR: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లంబసింగి, తాజంగి మధ్యలో రహదారి పూర్తిగా జలమయమైంది. రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటి ఉద్ధృత ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.