పత్తికొండలో గడ్డివాము దగ్ధం
KRNL: పత్తికొండ పట్టణంలో నిన్న రైతు పక్కీరప్పకు చెందిన గడ్డివాము అగ్నికి ఆహుతైంది. ఆదోని రహదారిలో పుష్ప హాస్పిటల్ పక్కన నిల్వ చేసిన పశువుల మేత గడ్డివాముకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని బాధితుడు ఆరోపించాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా సకాలంలో స్థలానికి స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.3.50 లక్షల విలువైన గడ్డి కాలిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు.